అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, స్పెషలిస్టు వైద్యులను శాశ్వత, కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు వాక్ – ఇన్ ఇంటర్వ్యూలు విజయవాడలోనే పాత ప్రభుత్వాసుపత్రిలో ఉన్న డిఎంఈ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ నెల 23న జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రో బయాలజీ , ఫోరెన్సిక్ మెడిసిన్, డెర్మటాలజీ, ఈఎన్‌టి, గైనకాలజీ, రేడియాలజీ, సైక్రియాటిక్ , ఆర్థో పెడిక్, అన స్ధిషియా, పాథాలజీ స్పెషలిస్టు పోస్టుల భర్తీకి వాక్ – ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్దులు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని స్పష్టం చేశారు. వివరాల కోసం వైద్య ఆరోగ్య శాఖ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చని తెలిపారు.