Friday, October 18, 2024

VSP: విశాఖ‌లో కోడిక‌త్తి కేసు విచార‌ణ‌..

కోర్టుకు హాజ‌రైన నిందితుడు శ్రీను
ఎన్ ఐ ఎ కోర్టు విచార‌ణ‌కు జ‌గ‌న్ డుమ్మా
నిందితుడి న్యాయ‌వాది ఆగ్ర‌హం
సాక్షి ఇచ్చేందుకు జ‌గ‌న్ కు అభ్యంత‌రం ఏమిట‌ని ప్ర‌శ్న

విశాఖపట్నం: మాజీ ముఖ్య‌మంత్రి, వైసిపి అధినేత జ‌గ‌న్ పై జ‌రిగిన కోడికత్తి కేసు విచార‌ణ నేడు విశాఖలోని ఎన్‌ఐఏ కోర్టులో జ‌రిగింది. ఈ కేసు విచార‌ణ‌కు ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌ హాజరయ్యాడు. న్యాయవాది సలీం, దళిత సంఘాల నేత బూసి వెంకటరావుతో కలిసి విశాఖలోని ఎన్‌ఐఏ కోర్టుకు వచ్చాడు. ఈ కేసులో సాక్షిగా వాగ్మూలం ఇవ్వ‌వ‌ల‌సిన జ‌గ‌న్ విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. కాగా ప‌టిష‌న‌ర్ త‌రుపు వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి విచార‌ణ‌ను వాయిదా వేశారు..

ఈ సందర్భంగా సలీం, బూసి వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న నారా లోకేశ్‌ పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరయ్యారని.. సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న జగన్‌ ఎందుకు రావడం లేదని సలీం ప్రశ్నించారు. బూసి వెంకటరావు మాట్లాడుతూ జైల్లో ఉన్న వ్యక్తులను కలిసేందుకు వెళ్లినపుడు లేని అభ్యంతరం కోర్టులో న్యాయమూర్తి ముందు సాక్షిగా హాజరై వాంగ్మూలం ఇచ్చేందుకు జగన్‌కు అభ్యంతరమేంటని నిలదీశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement