Friday, October 18, 2024

VSP: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. ఐటీడీఏ పీవో అపూర్వ భరత్..


చింతూరు, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ) : చింతూరు డివిజన్ లోని ఎక్కడికక్కడ పరిసరాలు పరిశుభ్రత చేసుకునే బాధ్యత అందరిపై ఉందని చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అపూర్వ భారత్ పేర్కొన్నారు. శుక్రవారం సంత మార్కెట్ లో శ్రమదానం కార్యక్రమం వివిధ కార్యాలయాలకు సంబంధించిన అధికారులతో, సిబ్బందితో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా చింతూరు పీవో మాట్లాడుతూ… డివిజన్ లోని ప్రతి కార్యాలయంలోనూ, సంత మార్కెట్లోనూ, మెయిన్ సెంటర్ లోనూ ఎక్కడికక్కడ పారిశుధ్య కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చింతూరులోని ప్రతి షాపులో చెత్త కుండీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కొంతమేర దోమల బారిన పడకుండా వివిధ వ్యాధులు రాకుండా ఉండవచ్చని ఆయన అన్నారు.

ప్రతి బుధవారం చింతూరులో జరిగే సంత మార్కెట్లో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో, సిబ్బందితో, ప్రజా ప్రతినిధులతో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి స్వచ్ఛభారత్ గా తీర్చిదిద్దే విధంగా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతూరు సర్పంచ్ కారం కన్నారావు, తహసీల్దార్ చిరంజీవి, ఇంచార్జ్ ఎంపీడివో గుంపనపల్లి మోహన్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బుచ్చిబాబు, పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement