ఆంధ్రప్రభ స్మార్ట్ – విశాఖపట్నం: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగుతోంది. కూటమికి 10కి 10 స్థానాలు దక్కాయి. ఏడుగురు సభ్యులకు 60కి పైగా ఓట్లు దక్కాయి. అయితే.. కౌంటింగ్ సమయంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మెజార్టీ స్థానాలు వైసీపీకే ఉన్నా 10కి 10స్థానాలు దక్కించుకోవడంలో కూటమి ప్లాన్ వర్కౌట్ అయ్యింది.
అయితే..టీడీపీ కార్పొరేటర్లు దొంగ ఓట్లు వేశారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ గీతలు ఉన్నాయని ఆ ఓట్లను తీసేయాలని వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర బైటాయించి నినాదాలు చేశారు
.విశాఖలో మొత్తం 98 డివిజన్లు ఉండగా.. ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సీపీఎం కార్పొరేటర్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మొత్తం ఓట్లు 96 ఉండగా.. వైసీపీకి 58 మంది, టీడీపీకి 29 మంది బలం ఉంది. జనసేనకు ముగ్గురు, నలుగురు ఇండిపెండెంట్ లు ఉన్నారు. సీపీఐ, సీపీఎం, బీజేపీ నుంచి ఒక్కొక్క కార్పొరేటర్ ఉన్నారు. అయితే ఇటీవల 17 మంది కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పారు.