Thursday, December 12, 2024

AP | ప్రశాంతంగా ముగిసిన‌ వీఆర్వో గ్రేడ్ 2 పరీక్షలు..

  • మొత్తం 615 మంది హాజరు…
  • పరీక్షల సరలిని పరిశీలించిన జెసి నిధి మినా

( విజయవాడ, ఆంధ్రప్రభ ) : వీఆర్వో గ్రేడ్ 2 సప్లమెంటరీ అభ్యర్థులకు నిర్వహించిన పరీక్ష నగరంలో ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. నగరంలోని వి ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఈ పరీక్షకు అభ్యర్థులు ఉత్సాహంగా హాజరయ్యారు.

వీఆర్వో గ్రేడ్ 2 సప్లమెంటరీకి సంబంధించి థియరీ మరియు ప్లాటింగ్ పరీక్షలను ఆదివారం నిర్వహించారు. మొత్తం 634 మంది అభ్యర్థుల హాజరు కావాల్సి ఉండగా 615 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వి ఆర్ సిద్ధార్థ కళాశాలలో జరుగుతున్న పరీక్ష సరలిని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మినా స్వయంగా పర్యవేక్షించారు.

వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ ట్రైనింగ్ అకాడమీ సామర్లకోట జాయింట్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ సిహెచ్ వి ఎస్ ఎన్ కుమార్, ఎక్స్టర్నల్ అబ్జర్వర్ కే శ్రీనివాసరావు జిల్లా సర్వే సహాయక సంచాలకులు టీ త్రివిక్రమ్ రావులు పరిశీలించారు.

ప్రస్తుతం పరీక్షల్లో హాజరైన అభ్యర్థులకు గతంలో 15 రోజులపాటు సర్వే శిక్షణ ఆంధ్రప్రదేశ్ సర్వే ట్రైనింగ్ అకాడమీ సామర్లకోట ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణను తీసుకున్నారు. అభ్యర్థులకు పరీక్ష సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు అధికారులు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement