అమరావతి – వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై చేసే విమర్శలకు అంతకు మించి అన్నట్లుగా కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పవన్ పై విరుచుకుపడుతున్నారు.దీనిలో భాగంగా వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ పవన్ కల్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు. పవన్ బెదిరింపులకు బయటపడటానికి ఇది సినిమా కాదన్నారు. ఉడత ఊపులకు భయపడే వ్యక్తి కాదు జగన్ అని..వైసీపీ పోవడం తరవాత పవన్ ముందు ఎమ్మెల్యే గా గెలిచి అసెంబ్లీ గేటు దాటు చూద్దాం అంటూ సవాల్ విసిరారు.
ఇక పవన్ కళ్యాణ్ తీరు వీధి రౌడీలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు.. అసాంఘిక శక్తి అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రానికి హానికరమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ తయారయ్యాడు అంటూ మండిపడ్డారు.
చంద్రబాబు దగ్గర పవన్ చేస్తున్న బానిసత్వానికి అలసట లేదు అంటూ విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని వ్యతిరేకించడం ఏ క్లాస్ వార్..?పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ను వ్యతిరేకించడం ఏ క్లాస్ వార్..?పవన్ ఎవరినైనా వ్యక్తిగతంగా మాట్లాడొచ్చా..? అంటూ మండిపడ్డారు. ఆయన్ని ఎవరూ ఏమీ అనకూడదా..?సింగిల్ గా పోటీ చేస్తాం అని చెప్పే దమ్ము పవన్ కి ఉందా..? అంటూ ప్రశ్నించారు.పవన్ కల్యాణ్ ముందు ఎమ్మెల్యే అవ్వడానికి ప్రయత్నం చెయ్యాలి అంటూ సెటైర్లు వేశారు.