ఢిల్లీ – వైసిపిని గద్దె దింపే లక్ష్యంతోనే టిడిపితో కలసి పోటీ చేస్తామని జనసేనాని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.. విపక్షాల ఓట్లు చీలకుండా ఉండాలనేది తమ పార్టీ విధామని తెలిపారు. . టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీచేస్తాయని అంటూ పరోక్ష సందేశం పంపారు.. . ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ పొత్తులపై మాట్లాడుతూ, వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలన్నది జనసేన విధానం అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులతో 2014లో కలిసి పోటీ చేశాయని.. 2019లో విడిపోవడం జరిగిందన్నారు. మళ్లీ బీజేపీ, జనసేన కలిసినా.. టీడీపీ, బీజేపీ మధ్య అండర్‌స్టాడింగ్ ఇష్యూ ఉందన్నారు. వాళ్ల సమస్యలపై మాట్లాడటం సరికాదన్న పవన్ కల్యాణ్ కచ్చితంగాఅందరం కలిసి పోటీ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంపై కూడా పవన్ స్పందిస్తూ, సీఎం ఎవరనేది సమస్య కాదన్న అంటూ జనసేన కేడర్ తనను సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు. క్షేత్రస్థాయిలో బలాబలాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయన్నారు.. ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్ధిపై స్పష్టత వస్తుందన్నారు. తమ ప్రాధాన్యత కేవలం వైసీపీని ఓడించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమేనని పవన్ స్పష్టం చేశారు.
జగన్ పాలనపై మాట్లాడుతూ, ఆధార్ లాంటి వ్యక్తిగత డేటా ఎందుకు ఇవ్వాలని చర్చ జరుగుతున్న సమయంలో ఏపీలో నెలకు ఐదు వేలకు రిక్రూట్ చేసిన ప్రైవేటు వ్యక్తులు డేటా సేకరిస్తున్నారని ఆరోపించారు . ఐరిష్, ఆధార్, బ్యాంక్ అకౌంట్స్ లాంటి సెన్సిటివ్ డేటాను తెలంగాణలో స్టోర్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందన్నారు. మౌలిక వసతులు పూర్తిగా లేవని, రైతులకు మద్దతు ధర రావడం లేదన్నారు పవన్. ఉద్యోగులకు సక్రమంగా జీతాలు రావడం లేదు. ఇలాంటివి ప్రశ్నించడానికి జనసేన ముందుకోచ్చిందని దీనికి ప్రజామద్దతు కూడా ఉందన్నారు జనసేనాని.