అసని తుఫాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదు అయింది. పూసపాటిరేగలో 6.5 సెంటీ మీటర్లు, గంట్యాడలో 6.2, మెంటాడలో 5.4, బొండపల్లిలో 4.8, ఎస్.కోటలో 4.7, విజయనగరంలో 4.5, డెంకాడలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 7.00 గంటల వరకు సగటున 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధి మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు అయింది. రాజాం, సంతకవిటి మండలాల్లో 2 సెంటీమీటర్ లు, రేగిడి ఆమదాలవలసలో 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, వంగరలో 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.