విజయనగరం జిల్లా అలమండ వద్ద జరిగిన రైలు ప్రమాదం కేవలం మానవ తప్పిదంగానే కనిపిస్తుంది. డెడ్ స్లోగా వెళ్లాల్సిన రాయగడ పాసింజర్ రైలు లోకో ఫైలట్ నిర్లక్ష్యం కారణంగా సిగ్నల్‌ను ఓవర్ షూట్ చేసినట్టు రైల్వే అధికారులు ప్రాథమిక నిర్ధారణ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది.
మరో వైపు ఒకే సమయంలో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఏ విధంగా సిగ్నల్ ఇచ్చారు ? నిజంగానే మానవ తప్పిదమా ? లేక సాంకేతికపరమైన కారణాలు ఉన్నాయా ? అనే విషయాలపై కూడా ప్రతి అంశాన్ని కూడా రైల్వే అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై రైల్వే మంత్రి సైతం ప్రత్యేక విచారణకు ఆదేశించిన నేపధ్యంలో వాల్తేరు డిఆర్‌ఎం ఆయా విచారణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టేందుకు సిద్దమవుతున్నారు.