Wednesday, December 4, 2024

Vizianagaram – రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థను పరిశీలించిన ప‌వ‌న్

విజయనగరం జిల్లా నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలోని చంపావతి నది పై ఉన్న రక్షిత మంచినీటి పంపింగ్ హౌస్‌ను నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు.విజ‌య‌న‌గ‌రం జిల్లాలోప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న గుర్ల గ్రామంలో అతిసారం ప్రబలడంతో పాటు పరిసర గ్రామాలకు కూడా ఈ పంపింగ్ హౌస్ నుండి నీటి సరఫరా జరుగుతుందని అధికారులు వివరించారు. పరిశీలన సమయంలో, నీటి శుద్ధి ప్రక్రియ , సమీప గ్రామాలకు అందుతున్న మంచినీటి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నీటి కాలుష్యం ఎక్కడ నుండి వస్తుందన్న దానిపై కూడా ఆరా తీశారు.

నీటి శుద్ధి విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని రక్షిత మంచినీటి సరఫరా శాఖ , జలవనరుల శాఖ అధికారులకు ఆయన ఆదేశించారు. పాతకాలం ఫిల్టర్ బెడ్లు మరియు నీటి సరఫరా వ్యవస్థకు మరమ్మతులు, ఆధునికీకరణ కోసం అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపించాలని సూచించారు.


గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంపై ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రక్షిత నీటి సరఫరా విషయంలో నిధుల కొరత లేదని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను వినియోగించి గ్రామీణులకు మంచినీరు అందించే చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాగునీటి కాలుష్యానికి గల కారణాలను గుర్తించి, వాటి నివారణకు శాశ్వత పరిష్కారం సూచించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement