Saturday, January 18, 2025

Vizianagaram – లారీని ఢీకొన్న బ‌స్సు – తండ్రి, కుమార్తె మృతి…

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మదుపాడ సమీపంలో ఆగి ఉన్న లోడ్ లారీని డెంటల్ సైన్స్ ఇన్‌ట్యిట్యూట్ బస్సు నేటి తెల్ల‌వారుఝామున ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో తండ్రి , కుమార్తె స్పాట్ లో మ‌ర‌ణించారు. మ‌రో అయిదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.. ప్ర‌మాద స‌మ‌యంలో బస్సులో 42 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారంతా ఫ్రీ మెడికల్ క్యాంప్ కోసం వెళ్తున్నట్లు సమాచారం.

ఒడిశాలోని మల్కాజిగిరి నుంచి విశాఖ తరగవలస వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.. ప్ర‌మాదం గురించి స‌మాచారం తెలిసిన వెంట‌నే సంఘటనా స్థలానికి 5 అంబులెన్స్ చేరుకున్నాయి. బస్సులో చిక్కుకున్నవారిని బయటకు తీశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.. బస్సులో ఉన్నవాళ్లు అంతా ఒరిస్సా రాష్ట్రంలో మల్కాజిగిరి వాసులుగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement