Thursday, November 21, 2024

Vizianagaram – తొమ్మిది మందిని మింగేసిన డయేరియా

గుర్ల(విజయనగరం), అక్టోబర్18(ఆంధ్రప్రభ): జిల్లాలోని గుర్ల డయేరియా మృతులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం మరో ఇద్దరు డయేరియా బాధితులు మృతి చెందారు. దీంతో డయేరియా మృతుల సంఖ్య ఇప్పటికే తొమ్మిదికి చేరినట్లయింది.

కాగా,మండల కేంద్రమైన గుర్ల గ్రామాన్ని గతవారం రోజుల నుంచి డయేరియా వణికిస్తోంది. ఈ వ్యాధితో ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే ఏడుగురు మృత్యువాత పడగా, తాజాగా నేడు మరో ఇద్దరు మృతి చెందారు .పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొలుత గ్రామానికి చెందిన చింతపల్లి అప్పారావులో ఈ నెల 12న డయేరియా లక్షణాలు కనిపించాయి. ఆయన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకున్నారు. రోగం తగ్గిందని ఇంటికి వెళ్లాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే మృతిచెందాడు. అలాగే కలిసేటి సీతమ్మ ఈ నెల 14న డయేరియాతో బాధపడుతూ పీహెచ్‌సీకి చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అదేరోజు విజయనగరం ఆస్పత్రికి వైద్యులు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది.

అలాగే, సారిక పెంటయ్య ఈ నెల 14న రాత్రి వాంతులు, విరోచనాలతో బాధపడుతూ మరుసటి రోజు ఉదయం మృతిచెందాడు. అదేవిధంగా పాండ్రంగి రాము, గుమ్మిడి పైడమ్మ కూడా డయేరియాతో విజయనగం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 15న మృతిచెందారు.

- Advertisement -

ఇక, గురువారం బోడసింగి రాములమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. రెండు రోజుల కిందట రాములమ్మ డయేరియా బారినపడడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆరోగ్యం బాగుందని ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లిన తరువాత ఆరోగ్యం విషమించి మృతిచెందింది. కాగా, వీరంతా వారం రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement