Saturday, November 23, 2024

వాక్సినేషన్ ప్రక్రియ వేగం కావాలి: కలెక్టర్

కోవిడ్ తో పాటు రక రకాల వేరియంట్ల భయాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేసి రక్షణ కల్పించాలని విజయనగరం జిల్లా కలెక్టరు ఏ.సూర్య కుమారి వైద్యాధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో కోవిడ్ వాక్సినేషన్ పై పి.హెచ్.సి వారీగా సమీక్షించారు. వాలంటీర్ల సహకారంతో వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. డైలీ ప్రోగ్రెస్ చూస్తానని, మీరు చెప్పే కారణాలు ఇకపై వినడం జరగదని స్పష్టం చేశారు. పురోగతి కనపడక పోతే సహించేది లేదని హెచ్చరించారు.

ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కన్నా ముఖ్యమైనది ఏదీ లేదని కలెక్టర్ పేర్కొన్నారు. తన సచివాలయ తనిఖీల్లో అనేక మంది ఇప్పటికి వాక్సిన్ వేసుకోలేదన్న కలెక్టర్.. వంద శాతం వాక్సినేషన్ జరగాలన్నారు. ఇంటింటికీ వైద్యులు వెళ్లి అవగాహన కలిగించి వాక్సిన్ వేయాలన్నారు. ఇందుకోసం ప్రతి వైద్యాధి కారి వద్ద ఒక కార్యాచరణ ప్రణాళిక ఉండాలన్నారు. ఎవ్వరూ రిలాక్స్ కాకూడదని, కోవిడ్ ముప్పు ఉందనే భావించాలని, మాస్క్ తప్పనిసరిగా  వినియోగించాలని అన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల  సేవలను పూర్తిగా  వినియోగించుకొని  వాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశం లో డి.ఎం.హెచ్.ఓ డా.రమణ కుమారి, డిప్యూటీ డి.ఎం.హెచ్ ఓ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement