Tuesday, January 21, 2025

Vizianagaram – హైకోర్టు తీర్పుతో నిలిచిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక …

విజయనగరం: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజు పై మండలి చైర్మన్ మోషన్ రాజు వేసిన అనర్హత వేటును హైకోర్టును రద్దు చేసింది. త‌న‌పై వేసిన అన‌ర్హ‌త‌ను కొ్ట్టివేయాలంటూ గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు ఇందుకూరి రఘురాజు. దీనిపై నేడు తుదివిచార‌ణ జ‌రిగింది. ఇరు వర్గాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం మండ‌లి ఛైర్మ‌న్ తీసుకున్న‌నిర్ణ‌యం చెల్లదంటూనేడు తీర్పుఇచ్చింది.. దీంతో ఆయ‌న 2027 నవంబర్ 31 వరకు ఎమ్మెల్సీ గా కొనసాగనున్నారు. ఇది ఇలా ఉంటే అన‌ర్హ‌త వేటును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే ఈ స్థానం ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల చేసింది. నామినేష‌న్ ల ప్ర‌క్రియ ప్రారంభ కానున్న‌త‌రుణంలో హైకోర్టు తీర్పురావ‌డంతో ఉప ఎన్నిక ప్ర‌క్రియ నిలిచిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement