Wednesday, November 20, 2024

విశాఖ ఉక్కు సంకల్పానికి నేటితో ఏడాది.. కార్మికుల‌కు ఉద్య‌మాభివంద‌నాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉద్యమం ప్రారంభమై నేటితో ఏడాది అవుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకూ పోరాటం ఆపేది లేద‌ని ప్ర‌క‌టించిన కార్మికులు.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ ప్రాణాలొడ్డి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చేపట్టిన ఉద్యమం చేపట్టారు. నేటీకి ఉక్కు పోరాటాన్ని కొన‌సాగిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. విశాఖ ఉక్కు కార్మికుల‌కు ఉద్య‌మాభివంద‌నాలు చేస్తున్నాన‌ని చెప్పారు. ఈ విష‌యంపై పార్ల‌మెంటు వ‌ర‌కు త‌మ పార్టీ నిర‌స‌న గ‌ళం వినిపిస్తూనే ఉంద‌ని తెలిపారు. విశాఖ ఉక్కుపై వైసీపీ ఎంపీలు మాట్లాడ‌ట్లేర‌ని ఆయ‌న ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని కుట్ర‌లు చేసినా ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడుకుంటామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement