విశాఖపట్నంలో ఓ 42 ఏళ్ల వ్యక్తి తన 15 ఏళ్ల కుమార్తెపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు కాగా, అతడిని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. యువతి ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతుందన్న కోపంతో తండ్రి ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్టు పేర్కొన్నారు. ఆ బాధను తట్టుకోలేక ఆ బాలిక ఇటీవల తన టీచర్‌కి లైంగిక వేధింపుల గురించి చెప్పింది. ఉపాధ్యాయురాలు తన తండ్రిని పాఠశాలకు పిలిపించి మందలించారు. అంతేకాకుండా ఆ టీచర్, బాలికతో కలిసి పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేశారు.
కాగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు తరలించారు. నిందితుడికి కిడ్నీలు విఫలమై రెండేళ్ల క్రితం అస్వస్థతకు గురైనట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. అతని భార్య అతనికి ఓ కిడ్నీ దానం చేసింది. ఐదు నెలల క్రితం భార్య కూడా అనారోగ్యానికి గురికావడంతో తన తల్లి ఇంట్లో చికిత్స పొందుతోంది. కాగా, ప్రస్తుతం కూతురు మాత్రమే అతడి బాగోగులు చూసుకుంటోంది.
మరో ఘటనలో 5 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో 12 ఏళ్ల బాలుడిని వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఆడుకుంటున్న సమయంలో బాలుడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.