Saturday, November 23, 2024

హెచ్ పీసీఎల్ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు: కలెక్టర్

విశాఖపట్నంలోని హెచ్ పీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్పష్టం చేశారు. ప్రమాదంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అరగంటలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారని కలెక్టర్ చెప్పారు.

కాగా, విశాఖలోని హెచ్‌పీసీఎల్‌ సీడీయూ 3వ యూనిట్‌లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. హెచ్‌పీసీఎల్‌లో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. క్రూడ్‌ డిస్టిలేషన్ యూనిట్‌ మొత్తానికి మంటలు అంటుకున్నాయి. మూడుసార్లు సైరన్ మోగించి కార్మికులను బయటకు పంపారు. సహాయక చర్యల్లో హెచ్ పీసీఎల్, అగ్నిమాపక సిబ్బందితో పాటు నేవీ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ సెన్సర్లు సవ్యంగా పనిచేయడంతో పెనుముప్పు తప్పింది. ప్రమాద సమాచారం అందుకున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement