విశాఖ సాగర తీరం ఆదివారం సందర్శకుల కేరింతలతో సందడిగా కనిపించింది. గత కొన్ని రోజులుగా 34 నుంచి 36 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్టంతో పాటూ అంతర్గతంగా ఉడికించే వాతావరణంలో తల్లడిల్లిపోయిన విశాఖ వాసులు ఆదివారం సముద్ర తీరంలో పెద్ద సంఖ్యలో గడిపారు. కుటుంబ సమేతంగా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుంచే తీరం చేరుకుని ఎగసిపడుతున్న సముద్ర కెరటాలను వాటి మాటున బండలను తాకి కెరటాలు తుళ్లిపడుతూ వెదజల్లిన జల్లు చల్లదనంలో తామూ సేద తీరడం కనిపించింది.
గుంపులు గుంపులుగా తీరం పొడవునా కనిపించిన వీరంతా సెల్ఫీలు దిగుతూ, బండలపై ఎగసిపడుతున్న కెరటాల ఉధృతి చూసి తన్మయులైపోతూ, నీట మునుగుతూ చిన్నారులు ఇసుకతో గోపురాలు కట్టుకుంటూ కూడా తెచ్చుకున్న ఆట వస్తువులతో ఆడుకుంటూంటే చూసి మురిసిపోతున్న తల్లిదండ్రుల మురిపాలుతో ఆదివారం సాగర తీరం సందడిగా మారిపోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.