విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చిన విశాఖ బంద్ కొనసాగుతోంది. కార్మికులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా.. కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఆదివారం ర్యాలీ నిర్వహించాయి. తమ అందరి అజెండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడమేనంటూ నినదించాయి.
కేంద్రం స్టీల్ ప్లాంట్‌కు కేవలం 5 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కార్మిక సంఘాల నేతలు ఆక్షేపించారు. తాము మాత్రం ఒక్కో ఏడాదికి 5 వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలోనే చెల్లిస్తున్నామని చెప్పారు.