Sunday, November 24, 2024

AP | వివేకా హత్య కేసు.. మౌనంగా ఉండాలని విపక్షాలకు కోర్టు ఆదేశం

వివేకానందరెడ్డి హత్యపై కడప కోర్టు సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. వైఎస్ వివేకా హత్యపై ఇకపై ఎవరూ మాట్లాడకూదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్థావన తీసుకురావడానికి వ్యతిరేకంగా వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు.

వైఎస్ వివేకా హత్య విషయంపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలకు ఆదేశాలు ఇవ్వాలని సురేష్ బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కడప కోర్టు వివేకా హత్య ప్రస్థావన తీసుకురావొద్దని వైఎస్ సునీత, షర్మిల, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, పురందేశ్వరిలను న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement