మాజీమంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని స్పష్టం చేసింది.
సీబీఐ కోర్టులో ట్రయిల్ జరిగేటప్పుడు ఏపీలో ఉండకూడదని హైకోర్టు షరతు విధించింది. అలాగే ఆయన పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. వీటన్నింటికీ శివశంకర్‌రెడ్డి అంగీకరించడంతో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలై శివశంకర్‌రెడ్డి పులవెందులకు వెళ్లనున్నారు.