కడప- వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ మంజూరయింది. అనారోగ్యం కారణంగా తనకు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్‌రెడ్డి తరపున హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ఎస్కార్ట్కు అయ్యే ఖర్చులు భరించాలని భాస్కర్ రెడ్డిని ఆదేశించింది.
కాగా మంగళవారం ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పు వెలువరిచింది. దీంతో వైఎస్ భాస్కర్ రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి ఎస్కార్ట్ బెయిల్‌పై విడుదల కానున్నారు. బెయిల్ ముగిసిన తర్వాత ఆయన మళ్లీ కోర్టులో లొంగిపోనున్నారు. వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే