మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక సాక్షులు దస్తగిరి, రంగన్నలకు మంగళవారం నుంచి భద్రతలో భాగంగా గన్‌మెన్‌ల సౌకర్యం కల్పించారు. కడప కోర్టు ఆదేశాల మేరకు ఒన్ ప్లస్ ఒన్ గన్ మెన్‌లను పోలీసుశాఖ కేటాయించింది. మరోవైపు ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వరాదంటూ.. వివేకా కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటీషన్ దాఖలు చేశారు. తన వాదనలను వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. వాదనల అనంతరం శివశంకర్ రెడ్డి బెయిల్, సునీత పిటీషన్‌లపై న్యాయస్థానం తదుపరి విచారణ ఏప్రిల్ 6కు వాయిదా వేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement