పులివెందుల, ప్రభన్యూస్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. మంగళవారం పట్టణంలోని ఆర్అం డ్‌బి గెస్ట్ హౌస్‌లో ఇనయ్తుల్లాను విచారించిన అనంతరం ఆర్అండ్బి గెస్ట్ హౌస్ నుంచి సీబీఐ అధికారులతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి పీఏ ఇనయ్‌తుల్లా, సర్వేయర్, వీఆర్వో, ప్రైవేట్ ఫోటోగ్రాఫర్‌ను తమ వాహనాల్లో వెంటబెట్టుకుని పలు ప్రాంతాలను కలియతిరిగారు.
ముందుగా వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నివాసాల వద్ద సర్వే చేసి ఇంటి పరిసరాలను ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. అనంతరం భరత్ యాదవ్, ఇ.సి.గంగిరెడ్డి ఆసుపత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి నివాసాల వద్ద సర్వే నిర్వహించి ఫోటోలు, వీడియోలు చిత్రీకరించారు. అనంతరం ఆర్అండ్బి గెస్ట్ హౌస్‌కు చేరుకుని మరలా ఇనయ్తుల్లాను విచారణ చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.