అమరావతి, ఆంధ్రప్రభ:మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత ్య కేసు దర్యాప్తులో రానురాను సరికొత్త అంశాలు తెరమీదకు వస్తున్నాయి. నాలుగేళ్ల సుదీర్ఘ ద ర్యాప్తులో వెలుగు చూడని విషయాలు, పరిణామాలు గత కొద్దిరోజులుగా సంచలనం కలుగచేస్తున్నాయి. వివేకా కుమార్తె పోరాటంతో.. సుప్రీంకోర్టు జోక్యంతో.. కేసు విచారణ తెలంగాణా కోర్టుకు బదిలీ కావడం, దర్యాప్తు ముగించాలని సీబిఐకి సుప్రీం డెడ్‌లైన్ విధించడం వంటి అంశాలు వివేకా కేసును ఒక కొలిక్కి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 30లోగా కేసు దర్యాప్తు పూర్తి నివేదికను సీబిఐ కోర్టుకు సమర్పించాల్సి ఉంది. అందువల్ల దర్యాప్తులో వేగం పెంచిన నేపధ్యంలో సూత్రధారులు, పాత్రధారులను అరెస్టు చేశామని చెబుతున్న సీబిఐ హత్యకు గల కారణాలను నిగ్గు తేల్చేపనిలో ఉంది. కుట్ర జరిగిందని చెబుతూనే ఎందుకు హత్య చేశారన్నది కూడా స్పష్టం చేసిన సీబిఐ కడప ఎంపీ అవినాష్, అతని తండ్రి భాస్కరరెడ్డిలపై అభియోగాలు మోపింది. అయితే దర్యాప్తులో కీలక అంశం నగదు లావాదేవీలే అని భావిస్తున్న సీబిఐ రూ.40 కోట్ల డీల్‌పై ఆరా తీస్తోంది. డీల్‌లో భాగంగా కోటి రూపాయలు సునీల్ యాదవ్‌కు అందించగా ఆ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారు..
ఎవరు ఇస్తారు అనే కోణం గత మూడురోజుల విచారణలో అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలపై సీబిఐ ప్రశ్నలు సంధిస్తోంది. అయితే అంత పెద్ద మొత్తంలో డీల్ కుదరడమంటే ఆషామాషీకాదు.. పైగా కోటి రూపాయలు చేతులు మారిందంటే మూలాలు మరోలా ఉన్నాయని సీబిఐ అనుమాని స్తున్న క్రమంలో మనీ ల్యాండరింగ్ అంశం తెర మీదకు వచ్చింది. అంత పెద్ద మొత్తం ఎవరి ఖాతా నుంచి బదలాయింపు జరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది. ఎవరు ఇస్తారు వాటి తాలూగా మూలాలు నిగ్గు తేలితే వివేకా కేసులో కీలక కోణం చేధించినట్లే అవుతుంది. అంటే అంత డబ్బు పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుందనేది తేలితే వారే ప్రధాన కుట్రదారులుగా తేలిపోతుంది. అందుకే మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టేందుకు రంగంలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంత పెద్ద మొత్తంలో సుపారీ ఇచ్చి మరీ వైఎస్ వివేకాను చంపించాల్సిన అవసరం ఏమిటనేది ఇప్పుడు కీలకంగా మారిపోయింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనకు రూ. కోటి అందాయని చెప్పాడు. సునీల్ యాదవ్‌కు కోటి ఇచ్చినట్లు సీబి ఐ విచారణలో వెల్లడైంది. ఈనేపధ్యంలో ఆడ బ్బు లావాదేవీలే కేసు వెనుక ఉన్న ప్రధాన కారణంగా భావిస్తున్న సీబిఐ అనుమానంతో రంగంలోకి దిగిన ఈడీ ఇప్పటికే కేసుకు సంబంధించి పూర్వాపరాలు అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.
ఆర్థిక లావాదేవీల నేపధ్యంపైనా..
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ఆర్ధిక లావాదేవీలకూ ముడి పడి ఉందంటూ జరుగుతున్న ప్రచారం, తెర మీదకు వస్తున్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్న సీబి ఐ ఈ దిశగా కూడా దర్యాప్తు చేస్తోంది. వ్యక్తిగత కక్షలు, వివాహేతర సంబంధాలు, కుటుంబంలో ఆర్ధిక పరమైన విభేదాలు, రెండో వివాహం-పిల్లలు తదితర కారణాలే హత్యకు దారి తీసి ఉంటాయంటూ ఓ ప్రచారం జరుగుతోంది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు ప్రమేయంపై అనుమానాలున్నాయంటూ వారిని ఎందుకు విచారించరని అవినాష్ రెడ్డి అనేక సందర్భాల్లో నిలదీశారు. ఆర్ధిక లావాదేవీలే కారణాలుగా అనే అంశాన్ని.. హత్యకు రూ.40 కోట్ల సుపారీ డీల్ అనే అంశాన్ని వేర్వేరుగా పరిగణించిన సీబిఐ తన దర్యాప్తు కోణంలో సుపారీ హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది. ఆ అవసరం ఎవరికి ఉంటుందనే కోణంలో విచారణలో ప్రశ్నలు పదే పదే అడుగుతున్నట్లు తెలుస్తోంది . హత్యలో పాల్గొన్న వారికి పెద్ద ఎత్తున డబ్బులు సమకూర్చారు. అది కూడా రూ.కోట్లలోనే అందుకే ఇక్కడ ఈడీ దర్యాప్తు అనివార్యమైందని, ప్రారంభం నుం చీ కేసు అధ్యయనం చేసిన ఈడీ అధికారులు ఇక నేరుగా ఈ 40 కోట్ల సమీకరణ మూలాలు తేల్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలున్నందున ఈడీ నిగ్గు తేల్చే అవకాశం కూడా ఉంటుందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ డబ్బులు ఎవరు ఇచ్చారని తేలితే వారే సూత్రధారులని, అక్కడ బయటపడటానికి అవకాశమే ఉండదని అంటున్నారు.
దర్యాప్తు ముగించాలన్న లక్ష్యంతో..
ఈనెల 30వ తేదీ డెడ్‌లైన్ అయినందున వీలైనంత త్వరగా దర్యాప్తు ముగించాలన్న లక్ష్యంతో సీబిఐ ముందుకెళ్తోంది. దాదాపు చివరి దశకు చేరుకున్న తరుణంలో అవినాష్ రెడ్డి విచారణ వద్దకు రాగానే కోర్టులో ఒకదాని వెంట ఒకటిగా పిటిషన్లు దాఖలవుతున్నప్పటికీ వాటిని అధిగ మించి దర్యాప్తుకు ముగింపు పలకాలని భావిస్తోంది. ఈనేపధ్యంలోనే ఈడీ ప్రవేశంతో 40 కోట్ల అంశం తేల్చడంతోపాటు కొద్దిరోజుల్లో మరికొంతమంది కీలకమైన వ్యక్తులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.