Friday, November 22, 2024

AP: వివేకా హ‌త్య కేసు – నిందితుడికి బెయిల్…

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అరెస్ట్ అయిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఉదయ్ కుమార్ బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.

ఈ క్రమంలో వివేకా హత్య కేసులో A6 నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి హైకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీవారం పులివెందుల పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలిని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement