హైదరాబాద్: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలపాటు అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. వైఎస్ వివేకా హత్యకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించి వాంగ్మూలం నమోదు చేసున్నారు..
కాగా, అవినాష్ రెడ్డిని ఇటీవల అరెస్టు చేసిన సీబీఐ.. రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గత నెల 31న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గత శనివారం (3న) సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణకు హాజరైన క్రమంలోనే అరెస్ట్, విడుదల జరిగాయి. అలాగే ప్రతి శనివారం సిబిఐ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి శనివారం అవినాష్ సిబిఐ విచారణకు హాజరవుతున్నారు..