నెల్లూరు(సిటీ) (ప్రభ న్యూస్) : జాతీయ స్థాయి నీట్ ఫలితాల్లో విశ్వసాయి కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఆ కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ తెలిపారు. మంగళవారం బీవీ నగర్‌లోని విశ్వసాయి కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ తమ కళాశాల నుంచి 120 మందికిపైగా విద్యార్థులు ఎంబీబీఎస్‌లో చేరేందుకు అర్హత సాధించారన్నారు. తమ విద్యార్థులు ఏ. అర్జున్ 653 మార్కులు , ఎం. అపూర్వ 650, కేఎం. హిందూజ 633 , సీహెచ్ రాజేష్ 628 , పి. బిందుభవాని 614,డి. స్వప్నిక 613 , కె. శ్రీ అమృత 604 , కె. సమైక్య 603 వంటి మార్కులు సాధించారన్నారు.
దాదాపు 64 మంది విద్యార్థులకు 500పైన మార్కులు వచ్చాయన్నారు. ఒకే కళాశాల నుంచి 120 మందికిపైగా విద్యార్థులు ఎంబీబీఎస్‌లో చేరబోవడం తమకు సంతోషంగా ఉందన్నారు. ఇంతటి విజయాలు సాధించిన విద్యార్థులకు , సాధింపజేసిన అధ్యాపక , అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. కళాశాల వైస్ చైర్మన్ జి. కృష్ణమోహన్ మాట్లాడుతూ ఒత్తిడి లేని విద్య , విద్యార్థుల పట్టుదల ఈ విజయానికి కారణమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్పర్సన్ రుక్మిణి , తదితరులు పాల్గొన్నారు.