Monday, November 18, 2024

AP : ప‌ల్నాడులో డిజిపి, చీఫ్ ఎల‌క్ష‌న్ అధికారి ప‌ర్య‌ట‌న

పోలింగ్ అనంతరం పల్నాడు ప్రాంతంలో భారీగా హింస చోటు చేసుకుంది. దీంతో ఈ ప్రాంతంపై ఎన్నిక‌ల సంఘం ప‌ల్నాడుపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి పరిస్థితులను నేడు పరిశీలించారు.

డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తాతో కలిసి సీఈవో ముఖేష్ కుమార్ మీనా అక్కడ పర్యటించారు. అల్లర్లపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పరిస్థితిపై కలెక్టర్‌ బాలాజీరావు, ఎస్సీ మల్లికా గార్గ్ నుంచి వివరణ తీసుకున్నారు.

- Advertisement -

అలాగే నరసరావుపేట మండలం కాకాని జెఎన్ టియు కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర సీసీ ఫుటేజ్‌ ను పరిశీలించారు. రిజిస్టర్‌ మెయింటేన్‌ చేయాలని అధికారులకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏర్పాట్లు, బందోబస్తుపై సమీక్ష నిర్వహించారు. టీడీపీ ఏజెంట్లతో మాట్లాడి ముఖేష్‌ కుమార్‌ మీనా పలు విషయాలపై ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement