Wednesday, January 8, 2025

AP | కార్యకర్తల సారథ్యంలోనే విజన్ 2029 సాధిస్తాం… చంద్రబాబు

జన నాయకుడు కార్యక్రమం కుప్పంలో పైలట్ గా ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం
కుప్పం, జనవరి 7(ఆంధ్రప్రభ) : జన నాయకుడు కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు తెదేపా కార్యాలయంలో జన నాయకుడు కార్యక్రమాన్ని ప్రారంభించి విలేకరుల సమావేశం లో మాట్లాడారు.

ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. ప్రజలకు చాలా హామీలిచ్చి ఓట్లు వేపించారు. కార్యకర్తల కష్టాన్ని వృధా కానివ్వనని ఆయన గట్టిగా హామీ ఇచ్చారు. తెదేపా పార్టీ కోసం పనిచేసిన వారు బయపడకండి.. మీ భవిషత్తుపై భరోసా నాది అని చంద్రబాబు అన్నారు. నేడు టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే కచ్చితంగా కార్యకర్తల త్యాగమే, వారి త్యాగాలను వృధా కానివ్వమని మరోసారి చెప్పారు. నాకు అన్నిటికన్నా కార్యకర్తలే ముఖ్యమ‌ని సీఎం చంద్రబాబు అన్నారు. వారి ద్వారా వచ్చిన వినతులు నేరుగా తనకు తెలిసేలా జన నాయకుడు కార్యక్రమం రూపొందించామని, వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చూసేలా చూస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క ఫిర్యాదుకు తప్పకుండా పరిస్కారం చూపిస్తాం. పార్టీకి సంబంధిత సమస్యలు, ప్రభుత్వ సంబంధిత సమస్యలు సమానంగా పరిష్కరిస్తామన్నారు.

చాలా వరకు కొంతమంది ఇచ్చిన ఫిర్యాదులే ఇస్తున్నారని కొంచెం సమయం ఇవ్వాలి, తప్పకుండా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. చాలా వరకు ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించేందుకు అన్ని విధాలా పార్టీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి తానే స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని చెప్పారు. నా సొంత నియోజకవర్గం పర్యటనకు వచ్చినపుడు తనకు సమస్య అని ఫిర్యాదు అందకుండా చేయాలనే విధంగా ఈ జన నాయకుడు ద్వారా చేయాలన్నదే నా లక్ష్యమని అన్నారు. రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన వ్యవస్థ విధ్వంసం నుండి బయట పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు.

- Advertisement -

ప్రతి ఒక్క నాయకుడు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలు తీర్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా తయారయ్యింధన్నారు. సమస్యలపై అధ్యయనం చేసి పరిస్కారం చూపే విధంగా చూస్తున్నామన్నారు. మీడియాపై రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన కేసులను సమీక్షించి వారిపై పెట్టిన కేసులు మాఫీ చేసేందుకు ప్రత్యేక జీఓ తెస్తామన్నారు. గత పాలనలో ప్రతిఒక్కరూ బాధితులే.. పార్టీలతో సంబంధం లేకుండా సామాన్య వ్యక్తులు, అధికారులు, మీడియాపై కూడా అనేక కేసులు నమోదు చేసారు. ఆ కేసులపై క్షుణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement