ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేతిస్తుందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పష్టం చేశారని గుర్తు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు వ్యూహత్మకంగా పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శించారు. వన్ సైడ్ లవ్, టు సైడ్ లవ్ అని ఆశలు పెట్టుకున్న వ్యక్తులకు పవన్ నిర్ణయంతో స్పష్టంగా తెలుసుకున్నారని అన్నారు. 2024లో బీజేపీ, జనసేన పొత్తుతో అధికారంలోకి వస్తేనే ఆంధ్ర ప్రదేశ్ బాగు పడుతుందన్నారు. బీజేపీ, జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది తమ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
బుధవారం విష్ణువర్ధన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న వివాదస్పద నిర్ణయాల వల్ల పేద ప్రజలు అట్టడుగుకు వెళ్లిపోతున్నారని అన్నారు. సామాన్యులకు ఇసుక, స్టిల్. సిమెంట్ కొనే పరిస్థితిలో లేరన్నారు. సినిమా టికెట్లు ధరలు కాదు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేలా ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రానికి ఈ రకమైన పరిస్థితి లేదని చెప్పారు. ఆదాయ వనరులు పెంచే విషయంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. ఒక చేత్తో ఓటు బ్యాంకుకు తాయిలాలూ వేస్తూ.. మరో చేత్తో నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. గడిచిన 30 నెలలు రాష్ట్రాన్ని ప్రభుత్వం తిరోగమనం వైపు తీసుకు వెళ్లిందని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital