Tuesday, November 26, 2024

Vishaka – జ‌గ‌న్ పై విరుచుకుప‌డ్డ అయ్య‌న్న పాత్రుడు

విశాఖపట్నం: భూములను కబ్జా చేయడమే వైసిపి పనిగా పెట్టుకుందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పారా? అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. విశాఖపట్నంలోని టిడిపి కార్యాలయంలో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అమరావతి రాజధాని లేదని.. మూడు రాజధానులు కూడా లేవన్నారు. సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే విరుచుకుపడ్డారు. రూ.3 వేల పెన్షన్ల విషయంలోనూ జగన్ ప్రజలను మోసం చేశారన్నారు. 40 ఏళ్లకు పెన్షన్ అని మాటిచ్చి.. దానిని పక్కన పెట్టేశారన్నారు. ఇళ్ళ విషయంలోనూ జగన్ మోసం చేశారని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్లకు ఆర్ధిక సహాయం అందిస్తోందని.. అయితే మోదీ గొడుగుని తన గొడుగగా జగన్ డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు.

గాదిరాజు ప్యాలెస్ మీద కూడా కన్నేశారని.. భారతికి నచ్చితే ఆ ప్యాలెజ్‌ని దొబ్బేస్తారా? అని అయ్యన్న పాత్రుడు నిలదీశారు. ప్రజల పాస్ బుక్ మీద, ఆఖరికి సర్వే రాళ్ల మీద జగన్ ఫోటో ఎందుకు ఉందని ప్రశ్నించారు. భూముల రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన ఒరిజినల్ పేపర్స్ మీ దగ్గర పెట్టుకోవడం ఏంటి? అమ్ముకోవడానికా? అని అడిగారు. ఇక్కడి ప్రజలు ఎందుకు మీకు ఓట్లేయాలి? భూములు దోచుకున్నందుకా? వదిలిపెట్టేదే లేద‌ని, మూడు నెలల తర్వాత అందరి లెక్కలు తీస్తామ‌న్నారు. ఎన్నికల తర్వాత జగన్‌ లండన్‌, అమెరికాలో దాక్కున్నా లాక్కొస్తామ‌ని,. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామని అన్నారు.

కాగా, జగన్‌కు తల్లి, చెల్లి, బాబాయ్‌ అనే తేడా లేద‌ని, నేనో లెక్కా అన్నారు..జ‌గ‌న్ పాల‌న‌పై నిప్పులు చెరుగుతున్న షర్మిలను అంతమొందించినా ఆశ్చర్య పడక్కర్లేదంటూ . ఆమెకు భద్రత పెంచాల‌ని డిమాండ్ చేశారు. రాజశేఖర్‌రెడ్డి ఆస్తిలో షర్మిలకు వాటా రాశార‌ని. అది జగన్‌ ఇవ్వడం లేద‌ని ఆరోపించారు.. కాగా,రాత్రుల సమయంలో తనని చంపేస్తామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని అయ్యన్న కుండబద్దలు కొట్టారు. అందుకే గన్ లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నానన్నారు. అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం తన తనయుడు దరఖాస్తు చేసుకుంటే తప్పేంటని తిరిగి ప్రశ్నించారు. అనకాపల్లిలో వైసీపీ నేతలు 1200 ఎకరాలకు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని.. తాను కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఈ భూ కుంభకోణాలపై సీఐడీ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరిన ఆయన.. న్యాయం కోసం న్యాయస్థానానికి కూడా వెళ్తానన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement