ఏపీ వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో ముందుకెళ్తున్నాయని పేర్కొన్నారు.
భూ కేటాయింపు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారమున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తొందర్లోనే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి సన్నాహాలకు సిద్ధమవుతామంటూ ఆయన పేర్కొన్నారు.