Saturday, November 23, 2024

Visakhapatnam – వచ్చే ఎన్నికల్లో ఉత్తరంలో గెలుపు నాదే…. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు

సీతమ్మ ధార ( విశాఖ ఉత్తర) వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజక వర్గంలో తన గెలుపు ఖాయం అని, సీఎం జగన్ పోటీ చేసినా తాను విజయం సాధిస్తాను అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణు కుమార్ రాజు అన్నారు. ఆయన గురుద్వారా వద్ద గల బీజేపీ ఉత్తర కార్యాలయం లో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి పక్ష నేతల అరెస్టులు కక్ష సాధింపు చర్యలు మాత్రమే అని పేర్కొన్నారు. చంద్ర బాబు అరెస్ట్ గురించి తెలియదు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరైనా ప్రభుత్వ విధానాలు విమర్శిస్తే కేసులు పెడుతున్నారు. మద్యం లో అవినీతి జరుగుతుంది అని సీబీఐ దర్యాప్తు చేయాలి అని రెండేళ్ల క్రితమే డిమాండ్ చేశాను అని గుర్తు చేశారు. చీఫ్ లిక్కర్ వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు అని విచారం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మద్యం ఆదాయం తగ్గింది అనడం అవాస్తవం. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రభుత్వ అరాచకాలు మీద స్పందించాలి అని కోరారు. దేశంలో 28 వేలకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు వుండగా, ఒక్క ఆంద్ర రాష్ట్రంలో 11348 కేసులు వున్నాయి అన్నారు. మార్గదర్శి సంస్థ పై ఫిర్యాదులు లేకుండానే కేసులతో వేధింపులకు గురి చేయడం అన్యాయం అన్నారు. తాను లీలా కృష్ణ టయోటా మోటార్స్ డబ్బులు తీసుకొని వాహనాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు అంటూ సి ఐ డి కి ఫిర్యాదు చేశాను, అయినా చర్యలు లేవు వ్యక్తిగత విమర్శలకు బీజేపీ దూరం అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని వోడించాలి అని కోరారు. రాజకీయాల్లో
మహిళల పట్ల దిగజారి మాట్లాడడం మంచిది కాదు. చంద్ర బాబు అరెస్ట్ తో బీజేపీ కి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement