Tuesday, November 26, 2024

ఢిల్లీని తాకిన స్టీల్ ప్లాంట్ ఉద్యమం

విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పడంతో కార్మికులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. స్టీల్ ప్లాంట్ పోరాటాన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలు ఢిల్లీకి తీసుకువెళ్లాయి. ప్రేవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విశాఖ ఉక్కు పరికర్షణ పోరాట కమిటీ సభ్యులు ఆందోళన చేస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ కార్మికులు నినాదాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలకు పలు రాజకీయ పార్టీల మద్దతు ప్రకటించాయి. అయితే నిరసన ప్రదర్శన చేయడానికి వచ్చిన స్టీల్ ప్లాంట్ సిబ్బందిని ఢిల్లీ పోలీసులు అడ్డుకుంటున్నారు. న్యూ రైల్వే స్టేషన్‌లోనే రెండున్నర గంటలు నిర్బంధించారు. జంతర్ మంతర్‌కు ఆటోలో వెళుతున్నవారిని కూడా అడ్డుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement