విశాఖపట్నం: విశాఖపట్నంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. కిరండోల్- విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికల అక్రమ రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు 11 మంది బాలికలను అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో రైల్వే పోలీసులు ఒక్కసారిగా ఆకస్మిక దాడి చేశారు. తమిళనాడుకు బాలికల్ని అక్రమ రవాణా చేస్తున్న రవి బిసోయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి బాలికల అక్రమ రవాణా చేస్తున్నాడు నిందితుడు . ఒడిశా,ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, నేపాల్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి బాలికల అక్రమ రవాణా చేస్తునట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా బాలికలను అక్రమ రవాణా చేసినట్లు పోలీసులు చెప్పారు. కిడ్నాప్ అయి రవాణా అవుతున్న ఆ చిన్నారులు ఒరిస్సాలోని నవరంగ్ పూర్ ప్రాంతానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. విశాఖ రైల్వే పోలీసులు బాలికల్ని ఒడిషా పోలీసులకు అప్పగించనున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు హ్యుమన్ ట్రాఫికింగ్ కేసును ఒడిషా పోలీసులకు అప్పగించారు.