Tuesday, November 26, 2024

AP | ఐటీ హబ్‌గా విశాఖ.. కలల నగరంగా వైజాగ్​ అభివృద్ధి చెందబోతోంది: సీఎం జగన్‌

విశాఖపట్నం, (ప్రభ న్యూస్ బ్యూరో)​ విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు. పరవాడ సెజ్‌లో ఫార్మా యూనిట్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. అలాగే బీచ్‌ క్లీనింగ్‌ సమకూర్చిన యంత్రాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సోమవారం తన విశాఖ పర్యటన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలోని రుషికొండలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర అంటే డిసెంబరు నెల లోపు ఈ మార్పు ఉంటుందని ప్రకటించారు. అంతేకాకుండా హైదరాబాద్‌, బెంగళూరు మాదిరిగా వైజాగ్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయి.

వైజాగ్‌ కూడా ఐటీ హబ్‌గా మారుతుంది. ఇప్పటికే విద్యాసంస్థల కేంద్రంగా మారింది కూడా. ఏటా 15 వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం. అంతర్జాతీయ విమానాశ్రయం, పొడవైన తీర ప్రాంతం విశాఖ సొంతం. ఇలాంటి సౌకర్యాలన్నీ ఉన్నందునే ప్రముఖ సంస్థలు అనేకం విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. కంపెనీలు ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కూడా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ‘త్వరలోనే విశాఖకు షిఫ్ట్‌ అవుతున్నాను. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుంది.

విశాఖ నుంచే పాలన కొనసాగిస్తాం. డిసెంబర్‌లోపు విశాఖకు మారుతాను. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్‌ అధికారులు మాట్లాడుతూ ఏపీలో హైబ్రీడ్‌ వర్కింగ్‌ మోడల్‌లో వెయ్యిమందికిపైగా ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ నిపుణులకు కొదవలేదని వ్యాఖ్యానించారు

ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌, బెంగళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోందన్నారు. రాష్ట్రంలోనే విశాఖ అతిపెద్ద నగరం అని, ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారైందన్నారు. ప్రతీ ఏడాది 15వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారని, విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఒక్క ఫోన్‌ కాల్‌తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కంపెనీలకు కల్పిస్తామని, వైజాగ్‌లో విస్తారమైన అవకాశాలున్నాయని చెప్పారు. త్వరలోనే తానూ విశాఖకు షిప్ట్‌ అవుతున్నానని స్వయంగా వెల్లడించారు.

- Advertisement -

త్వరలో విశాఖకు మకాం

విశాఖకు మకాం మార్చడంపై సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సోమవారం కీలక ప్రకటన చేశారు. డిసెంబర్‌ నాటికి విశాఖకు రాబోతున్నట్లు వెల్లడించారు. పరిపాలనా విభాగమంతా ఇక్కడికే వస్తుందని, ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తానని తెలిపారు. విశాఖలో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఐటీ హిల్స్‌ వద్ద ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే జీవీఎంసీ బీచ్‌ క్లీనింగ్‌ వాహనాలను ప్రారంభించి మాట్లాడారు. విశాఖ నగరానికి ఉజ్జ్వల భవిష్యత్‌ ఉంది. వైజాగ్‌ కలల నగరంగా అభివృద్ధి చెందబోతోంది. ఇన్ఫోసిస్‌ రాకతో విశాఖ మరింత వేగంగా వృద్ధి చెందుతుంది. ఇన్ఫోసిస్‌కు అన్ని విధాలుగా సహకరిస్తాం. డిసెంబర్‌ నాటికి నేను కూడా విశాఖకు రాబోతున్నా. డిసెంబర్‌ నుంచి నేను కూడా విశాఖలోనే ఉంటానని సీఎం జగన్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement