Monday, November 25, 2024

Visakha – ఎంపీ విజయసాయి కుమార్తె భవన నిర్మాణాలు కూల్చి వేత

విశాఖ – వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూతురుకి షాక్ ఇచ్చారు అధికారులు. విశాఖ జిల్లా భీమిలిలోఆయన కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను కూల్చివేత ప్రారంభించారు అధికారులు.

సీఆర్‌జడ్‌ గైడ్ లైన్స్‌ను ఉల్లంఘిస్తూ నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 1516, 1517, 1519, 1523 సర్వే నంబర్లలోని స్థలంలో ఈ కాంక్రీట్‌ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవి అక్రమ కట్టడాలంటూ జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ హైకోర్టులో పిటిషన్ వేయగా… విచారించిన ధర్మాసనం వైసీపీ ఎంపీ కుమారి పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అక్రమానిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది..

- Advertisement -

అసలేమైంది…

ఇటీవల విశాఖలో అక్రమ కట్టడాలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. భీమిలి సముద్ర తీరంలో సీఆర్‌జడ్‌ నిబంధనలకు విరుద్ధంగా సాగిన నిర్మాణాలపై హైకోర్టు కన్నెర్ర చేసింది. వైసీపీ ఎంపీ విజయిసాయిరెడ్డి కుమార్తె నిర్మించిన ప్రహరీ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని జీవీఎంసీకి కోర్టు ఆదేశం ఇచ్చింది.

హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కూల్చివేతలు ప్రారంభించారు. అధికారులు.నిర్మాణాలపై కోర్టులో పిల్ వేశారు జనసేన కార్పొరేటర్ మూర్తి. భీమిలి పరిధిలో ఓ కంపెనీ నుంచి సుమారు మూడున్నర ఎకరాలు కొందరు కొనుగోలు చేశారు. వారి నుంచి కొనుగోలు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కొనుగోలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించి సముద్రానికి అతి సమీపంలో కాంక్రీట్ నిర్మాణం చేశారని..ఇసుక తిన్నెలను తొలగించి..గ్రావెల్‌తో చదును చేశారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement