న్యూఢిల్లీ – విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందు గాను ప్రధాని మోదీకి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు సైతం కేంద్రానికి థ్యాంక్స్ చెప్పారు..
స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల సంబరాలు..
స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం నిధులు కేటాయించిన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు కార్మికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు… ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు భీమిలి నియోజకవర్గం శాసన సభ సభ్యుడు గంటా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టిబలిజ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి మధుసూదన రావు తదితరులు పాల్గొన్నారు…