Saturday, November 9, 2024

Visakhapatnam | వెన‌క్కి వెళ్లిన స‌ముద్రం..

విశాఖపట్నం, ప్రభన్యూస్‌: విశాఖపట్నం ఆదివారం అరుదైన దృశ్యం కనిపించింది. సాధారణంగా విశాఖ ఆర్కే బీచ్ వ‌ద్ద అలలు పెద్ద ఎత్తున‌ ఎగసిపడుతూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతాయి. అయితే, దానికి అందుకు భిన్నంగా ఆదివారం సముద్రం దాదాపు 400 మీటర్ల మేర వెనక్కి తగ్గింది. ఈ చిత్రాన్ని చూసేందుకు విశాఖ నగరంలోని ప్రజలతోపాటు, పలువురు పర్యాటకులు సాగరతీరంతో కిటకిటలాడింది.

మరోవైపు వారంతపు సెలువు ఆదివారం కావడంతో విశాఖ ఆర్కేబీచ్‌ పర్యాటకులు, పెద్దలు, పిల్లలతో కిక్కిరిపోయింది. బీచ్‌లో సేద తీరేందుకు వచ్చిన జనం సముద్రుడు వెనక్కి వెళ్లటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆపై రాళ్లపైకి చేరి యువతీ, యువకులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఇదే సమయంలో విశాఖలోని ఆర్కేబీచ్‌తో పాటు, కైలాసగిరి, తోట్లకొండ, రుషికొండ పర్యాటక ప్రాంతాలన్ని సూదర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో సందడి వాతావరణంలో కనిపించాయి. అయితే విశాఖలో ఈ సముద్రం వెనక్కి వెళ్లడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement