Thursday, December 12, 2024

Visakha Port – విశాఖ పోర్టులో 480 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్

విశాఖపట్నం – ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ పోర్టులో నేడు ఆకస్మిక తనిఖీలు చేశారు. వైజాగ్ పోర్టు బియ్యం స్మగ్లింగ్ కు గేట్ వే గా మారిందనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల పోర్టులో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ అకస్మిక తనిఖీల్లో బియ్యం అక్రమ రవాణ బాగోతం వెలుగుచూసింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ లో ఎగుమతికి సిద్ధంగా ఉంచిన బియ్యంను సీజ్ చేశారు.

రాయపూర్ కు చెందిన ఎ జి ఎస్ ఫుడ్స్ పేరుతో కన్ సైన్ మెంట్ ఉంది. 480 మెట్రిక్ టన్నుల సివిల్ సప్లైస్ బియ్యంను ప్రత్యేక బృందాలు సీజ్ చేశాయి.

- Advertisement -

కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో బియ్యం అక్రమ రవాణకు గత రెండు నెలలుగా విశాఖ పోర్ట్ ను ఎంచుకున్నట్లు గుర్తించారు.

‘గత మూడేళ్లలో కాకినాడ పోర్టు నుంచి కోటి 38లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణ అయ్యింది. విశాఖ నుంచి 36 వేల మెట్రిక్ టన్నులు అక్రమ రవాణ జరగగా.. దాని విలువ రూ.12 వేల కోట్లుగా గుర్తించాం. కాకినాడ పోర్టుపై నిర్భంధం పెరగడంతో ఇక్కడ నుంచి రెండు నెలల్లో 70 వేల మెట్రిక్ టన్నుల బియ్యం విదేశాలకు తరలిపోయింది. చెడిపోయిన బియ్యం అక్రమ రవాణ చేయడం వల్ల దేశానికి చెడ్డపేరు వస్తోంది” అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు

.

Advertisement

తాజా వార్తలు

Advertisement