భారతదేశం – పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో నేవి డే నిర్వహించనున్నారు. ఈ ఏడాది మైచాంగ్ తుపాను కారణంగా 4వ తేదీన జరగాల్సిన వేడుక 10వ తేదీకి వాయిదా పడింది.
తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆర్కే బీచ్లోలో ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది నేవీ డేకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేవీ యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లలు, జలాంతర్గాములు, హెలికాప్టర్లతో సిబ్బంది విన్యాసాలు చేస్తారు. దాదాపు 2 వేల మంది నౌకాదళ సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొంటారు. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.