Wednesday, November 20, 2024

Visakha – ఎపిలోనూ హైడ్రా … అక్ర‌మ నిర్మాణాలు తొల‌గింపున‌కు నిర్ణ‌యం

అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తాం
13 జిల్లాల్లో సమాన అభివృద్ధే లక్ష్యం
విశాఖ డంపింగ్ యార్డు అధునికీకరిస్తాం
సెప్టెంబరు నెలాఖరుకు టీడీఆర్ బాండ్లు కొలిక్కి
రుషికొండ వినియోగంపై సీఎందే తుది నిర్ణయం
విశాఖలో మున్సిపల్ మంత్రి నారాయణ

ఆంధ్రప్రభ స్మార్ట్, మధురవాడ (విశాఖపట్నం) : ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను త్వరలో కూల్చేస్తామని, రుషికొండ భవనాలను దేనికి వినియోగించాలి, 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి అంశాలపై సీఎం చంద్రబాబు ప్రణాళికను సిద్ధం చేశారని, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ సమీపంలోని చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్ ను మంగళవారం సందర్శించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తో కలిసి ప్లాంట్ లోని అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేస్ట్ టూ వెల్త్ కింద రాష్ట్రంలో చేపట్టిన మొదటి ప్రాజెక్టు ఇదేనని, విశాఖపట్నం విస్తీర్ణంలోనే సింగపూర్ లో 4 వేస్ట్ ప్లాంట్లు, కోటి జనాభా కలిగిన టోక్యోలో 48 డివిజన్లకు 49 వేస్ట్ ప్లాంట్లు ఉన్నాయని వివరించారు. 13 ఉమ్మడి జిల్లాల్లో 13 వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచించారని, 1,500 టన్నుల సామర్థ్యంతో విశాఖ ప్లాంట్, వెయ్యి టన్నుల సామర్థ్యంతో గుంటూరు ప్లాంట్ ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నాయన్నారు.

- Advertisement -

కేంద్రం నుంచి నిధులు ర‌ప్పిస్తాం..
గ‌త ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిలిచిపోయిన కేంద్ర నిధులను రప్పించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నారాయ‌ణ అన్నారు. తణుకులో రూ.59 కోట్ల టీడీఆర్. బాండ్లకు గాను రూ.730 కోట్ల బాండ్లను విడుదల చేశారని, కోర్టు ఆదేశాల ప్రకారం అక్రమ టీడీఆర్.లపై కమిటీలు నియమించామని, . వచ్చే నెలాఖరుకు టీడీఆర్. వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందన్నారు. 203 అన్న క్యాంటీన్లలో 202 భవనాలు సిద్ధంగా ఉన్నాయని, . ఆగస్టు 15 న 100 క్యాంటీన్లు ప్రారంభించామని, సెప్టెంబర్ 13 న మరో 75 ప్రారంభిస్తామన్నారు. .

మరింత అప్ గ్రేడ్ చేయాలి : ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

తీవ్ర దుర్వాసన వస్తుందనే ఉద్దేశంతో డంపింగ్ యార్డును కాపులుప్పాడ నుంచి తంగుడిబిల్లి తరలించాలని 2014 లో ప్రతిపాదించామని, ప్లాంట్ ను మరింత ఆధునికీకరించి ఎలాంటి దుర్వాసన రాకుండా చూడాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. వేస్ట్ ప్లాంట్ ను ఆదాయ మార్గంగానే కాకుండా సామాజిక బాధ్యతగా కూడా చూడాలని, . విశాఖ స్టీల్ ప్లాంట్ లో గణనీయంగా పచ్చదనం పెంచడంతో విశాఖ నగరంలో స్టీల్ ప్లాంట్ లో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని. డంపింగ్ యార్డ్ దగ్గర కూడా ఆ స్థాయిలో పచ్చదనం పెంచాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ మంత్రి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement