Thursday, September 12, 2024

Visakha – నారా లోకేష్ ప్ర‌జా ద‌ర్బార్ కు విన‌తుల వెల్లువ

ఉన్మాది చేతిలో కుమార్తెను కోల్పోయాను, న్యాయం చేయండి
అమెరికాలో అరెస్టైన తమ కుమారుడిని దేశానికి తీసుకురండి
భూమి కబ్జా చేసి చంపుతామని బెదిరిస్తున్నారు

విశాఖపట్నం: ప్రజా కూటమి విజయం తర్వాత మొట్టమొదటి సారిగా విశాఖలో పర్యటిస్తున్న విద్య,ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఉదయం జిల్లా పార్టీ కార్యాలయంలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలుసుకున్నారు. సమస్యల పరిష్కార వేదికైన “ప్రజాదర్బార్” నిర్వహించి ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులు స్వీకరించారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి ఫోటోలు దిగారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

ఇళ్ల స్థలాలు ఆక్రమించి వైసీపీ నేతలు వేధిస్తున్నారు

  • ప్రేమించాలంటూ వెంటపడి, ఉన్మాది చేతిలో కుమార్తెను కోల్పోయిన తమ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని అనకాపల్లి జిల్లా కొప్పగుండుపాలెంకు చెందిన బద్ది వెంకటరమణ విజ్ఞప్తి చేశారు.
  • అమెరికాలో విద్యనభ్యసిస్తున్న తమ కుమారిడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారని, ఏం జరిగిందో ఇంతవరకు సమాచారం లేదని విశాఖకు చెందిన ఏ.అప్పలకొండ మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. ఎలాగైనా తమ కుమారుడిని అమెరికా నుంచి దేశానికి తీసుకువచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
  • వారసత్వంగా సంక్రమించిన భూమిని కబ్జా చేయడంతో పాటు చంపుతామని బెదిరిస్తున్నారని, తమ భూమిని కబ్జారాయుళ్ల నుంచి విడిపించడంతో పాటు ప్రాణరక్షణ కల్పించాలని అనకాపల్లి జిల్లా బంగారయ్యపేటకు చెందిన మాతిరెడ్డి రాజునాయుడు విజ్ఞప్తి చేశారు.
  • ఆంధ్రాయూనివర్సిటీ నాటకరంగ విభాగంలో అతిథి అధ్యాపకునిగా నియమించాలని గజపతినగరం నియోజకవర్గం కొత్తపాలెంకు చెందిన వి.త్రినాథరావు విజ్ఞప్తి చేశారు.
  • కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చదివిన తనకు ఉద్యోగం కల్పించాలని విశాఖకు చెందిన సనపాల మనోజ్ కోరారు.
  • బంగారు భూమి ఎస్ఎమ్ఎల్ డెవలపర్ల నుంచి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయగా.. వైసీపీ నేతలు ఆక్రమించి వేధిస్తున్నారని, తగిన న్యాయం చేయాలని విజయనగరం జిల్లా గులివిందడకు చెందిన బాధితులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల ప్రమాణాలకు మించి 9, 10వ తరగతి సీబిఎస్ఈ హిందీ పాఠ్యపుస్తకాలు ఉండటంతో విద్యార్థులు భయపడతున్నారని, 10వ తరగతి హిందీ ప్రస్తుత టెక్ట్స్ బుక్స్ స్థానంలో పాత టెక్ట్స్ బుక్స్ ను కొనసాగించాలని నర్సీపట్నంకు చెందిన హిందీ భాష ప్రచార సమితి ప్రతినిధులు కోరారు.
  • సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీవో నెం.61ను అమలుచేయాలని, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని దళిత హక్కుల సంక్షేమ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
  • ఉత్తరాంధ్ర జిల్లాల విశ్వవిద్యాలయాలకు ఉత్తరాంధ్ర బీసీ ఆచార్యులనే వైస్ ఛాన్స్ లర్లుగా నియమించాలని ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ప్రతినిధులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement