Tuesday, December 10, 2024

AP | నాలెడ్జ్ ఎకానమీకి విశాఖ ఫ్యూచర్ సిటీ : సీఎం చంద్రబాబు

(ఆంధ్రప్రభ స్మార్ట్, విశాఖపట్నం) : నాలెడ్జ్ ఎకానమీకి ఫ్యూచర్ సిటీగా విశాఖపట్నం మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తమ నగరాలలో ఒకటిగా విశాఖ నిలుస్తుందన్నారు. టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, నాలెడ్జ్ ఎకానమీలో యువత కీలకంగా మారారని అన్నారు.

విశాఖపట్నంలో నేషనల్‌ డీప్‌ టెక్‌ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌‌కు శుక్రవారం హాజరయ్యారు. డీప్‌ టెక్నాలజీ సదస్సు-2024 లో స్వర్ణ ఆంధ్ర ట్రాన్స్ఫామేషన్ ఇండియా టూ వికసిత భారత్ , ఏఐ ఫర్ ఎవరీ వన్ అనే రెండు పుస్తకాలు ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ప్రపంచంలో ఎటు చూసినా టెక్నాలజీపైనే చర్చ జరుగుతోందన్నారు. దీని కారణంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. జీవితంలో అది కూడా ఓ భాగంగా మారిందన్నారు.

మూడో వంతు ఐటీ నిపుణులు మనోళ్లే

- Advertisement -

దేశం, విదేశాల్లోని ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారేనని గుర్తు చేశారు. ఐటీ గురించి ఎవరు మాట్లాడినా హైటెక్‌ సిటీ ప్రస్తావన వస్తుందన్నారు. అప్పట్లో ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకున్నామన్నారు. ఇప్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ కేంద్రమైందన్నారు. దీన్ని అందుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందన్నారు.

ఏపీని నాలెడ్జ్‌ హబ్‌గా మారుస్తామని మనసులోని… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధికి ఒక విజన్ ప్రకారం ముందుకు వెళ్లామన్నారు. విశాఖ నగరం భవిష్యత్ నాలెడ్జ్ హబ్ అన్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫ్రామింగి డెవెలప్‌మెంట్ నినాదంతో వెళ్తున్నామన్నారు.

వెయ్యి కిలోమీటర్లు తీరం ఉందని.. సముద్ర రవాణా మీద బాగా దృష్టి పెట్టామన్నారు. పవర్ సెక్టార్‌లో రాష్ట్రం మంచి అభివృద్ధి సాధించిందన్నారు. త్వరలో గ్రీన్ హైడ్రోజిన్ కూడా ఏపీ నుంచి ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement