ఆంధ్రప్రభ స్మార్ట్, శ్రీకాకుళం బ్యూరో : ఏపీలో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చిన్న కొజ్జిరియ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం అతివేగంగా వచ్చిన కారు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కదిరిశెట్టి సోమేశ్వరరావు, ఎం లావణ్య, స్నేహ గుప్తా మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను, మృతులను ఆసుపత్రికి తరలించారు.
మంత్రులు దిగ్ర్భాంతి
శ్రీకాకుళం కంచిలి మండలం చిన్న కోజ్జిరియా జంక్షన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణంపై ఏపీ మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చలించిపోయారు. జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డితో ఫోన్ మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.