Saturday, September 14, 2024

Visakha – ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి అభ్యర్థి ఎవరంటే

ఆంధ్రప్రభ స్మార్ట్ – విశాఖ – అనకాపల్లి ఎంపీ టికెట్‌ ఆశించిన బైరా దిలీప్‌ చక్రవర్తి పేరు విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి అభ్యర్థి గా ప్రకటించారు . ఈ ఎన్నికకు సంబంధించి నామినేషన్లకు ఈనెల 13వ తేదీతో గడువు ముగియనున్నది .

కాగా, విశాఖ నగరంలోని ఒక హోటల్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన కూటమి ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, సీహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌, టీడీపీ విశాఖ అధ్యక్షుడు గండి బాబ్జీ, దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌, తదితరులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని నేతలంతా నిర్ణయించారు. పోటీకి సుముఖంగా ఉన్న పీలా గోవింద, గండి బాబ్జీల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో బైరా దిలీప్‌ పేరు చర్చకు వచ్చింది. సమావేశంలో చర్చించిన అంశాలను చంద్రబాబునాయుడుకు పల్లా శ్రీనివాసరావుకు నివేదించారు. అత్యధికులు బైరా దిలీప్‌ పేరు ప్రతిపాదించ డంతో నేడు టీడీపీ అధ్యక్షుడు చద్రబాబు అధికారికంగా ఆయన పేరు ప్రకటించారు. ఇక వైసిపి తరుపున బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు.

ఇంతకీ ఎవరు? బైరా దిలీప్ చక్రవర్తి.

మాజీ సివిల్స్ అధికారి. కేవలం మూడేళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత రాజీనామా చేశారు. ఐఏఎస్ లేదా ఐపీఎస్ అయితే ప్రజలతో ఉండాలని భావించారట. టేబుల్‌కి పరిమితం కావడంతో డ్రాపయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చక్రవర్తికి ఏడెనిమిది భాషల్లో ప్రావీణ్యత ఉంది.తొలుత చిరంజీవి ప్రారంభించిన పీఆర్పీ‌లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత జనసేనలో కొనసాగుతున్నారు.

మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ టిక్కెట్‌పై పోటీ చేయాలని భావించారు. కాకపోతే సీఎం రమేష్ పేరు తెరపైకి రావడంతో ఆయన సైలెంట్ అయ్యారు. తాజాగా ఆయనకు అదృష్టం వరించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట. చిరంజీవి, పవన్‌కల్యాణ్, గంటా శ్రీనివాసరావుతో ఆయనకు మంచి సంబంధాలు న్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement