విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్‌పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. విశాఖలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో నేడు దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్ మున్నీసా బేగంపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో భాదితురాలికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement