Tuesday, November 12, 2024

Visakha – ఆనందపురంలో ఘోర రోడ్డు ప్రమాదం … ముగ్గురు మృతి

★ రెండు లారీలు ఢీ
★ మరొకరు పరిస్థితి విషమం
★ ఆనందపురం వేములవలస జాతీయ రహదారిపై ఘటన

విశాఖ ఆనందపురం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఆనందపురం మండలం వేములవలస ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎన్ హెచ్- 16 రోడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా వస్తూ ఢీ కొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా హాస్పటల్లో చికిత్స పొందుతున్న క్లీనర్ మృతి చెందాడు. మరో లారీ క్లీనర్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

- Advertisement -

★అతివేగమే ప్రమాదానికి కారణం..

అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఓ లారీ అతివేగంతో వస్తూ అదుపుతప్పి డివైడర్ పైనుంచి వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మినిమం స్పీడుతో లారీ వెళ్ళినట్లయితే ఆ లారీ అదుపు తప్పేది ఉండేది కాదు ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పోలీసులు పేర్కొంటున్నారు.అటువైపు లారీ ను ఢీకిట్టి ఉండక పోతే బ్రిడ్జి మీద నుండి కిందకు పడిపోయి ఉండేదని పోలీసులు చెబుతున్నారు.

★ సంఘటన స్థలంలోనే ఇద్దరు డ్రైవర్లు మృతి

ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలోనే ఇద్దరు లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ఇద్దరు లారీ క్లీనర్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అత్యవసర చికిత్స నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. ఇందులో ఒక క్లీనర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో క్లీనర్ పరిస్థితి విషమంగా ఉంది.

★ ప్రమాదం జరిగిన తీరు..

రాయగడ నుండి బయలుదేరి ఖమ్మం వెళ్ళుటకు అట్టలు లోడుతో వస్తున్న ఓ లారీ ని ఆకువీడు నుండి భువనేశ్వర్ వైపు నుంచి వస్తున్న వేగంగా వస్తున్న మరో లారీ మార్గం మధ్యలో ఆనందపురం మండలం వేములవలస ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్ వద్దకు వచ్చేసరికి డివైడర్ ను దాటుకొని బలంగా ఢీ కొట్టింది.
దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు నడుపుతున్న డ్రైవర్స్ ఇద్దరూ సంఘటన స్థలంలోనే మృతిచెందారు.
రెండు లారీలు తాలూకా క్లీనర్స్ కు గాయాలవ్వగా వారిద్దరిని 108 అంబులెన్స్ లో కె జి హెచ్ కు తరలించారు ఇందులో హాస్పటల్లో మరొకరు మృతి చెందారు. ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

★ విశాఖలో వరుస ప్రమాదాలు..

విశాఖలో వరుస రోడ్డు ప్రమాదాలు కొనసాగుతున్నాయి. వారంలో ఒక ఘటన జరగడం ఇక్కడ సర్వసాధారణమైపోయింది. ప్రమాదాల నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. వాహనదారులు కూడా నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా తమ వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. గత పదేళ్లలో విశాఖలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాలలో చాలామంది మృతి చెందగా మరి కొంతమంది తీవ్ర గాయాల పాలై అంగ వికలురుగా మారుతున్నారు.

★ నిబంధనలకు పాతర..

పలువురు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా మద్యం సేవించి అతివేగంతో తమ వాహనాల నడుపుతూ ఉండటంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలలో వారితో పాటు ఎదురుగా వస్తున్న వారు కూడా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. విశాఖలోని జాతీయ రహదారి పైనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు మారినా సరే ప్రమాదాలు నివారణకు మాత్రం ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే కొందరు వాహనదారులు మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement