విశాఖపట్నం : విశాఖ జూలో గత 20 సంవత్సరాలుగా ప్రత్యేక ఆకర్షణగా ఉన్న వైట్ టైగర్ కుమారి సోమవారం కన్నుమూసింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వైట్ టైగర్ కు వెటర్నరీ వైద్యులు గత కొన్ని రోజులుగా చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో సోమవారం జూ లోనే కన్నుమూసింది. 2004 సంవత్సరంలో హైదరాబాద్ జూ లో ఈ వైట్ టైగర్ కుమారి జన్మించింది. ఆ తర్వాత అక్కడి నుంచి దానిని విశాఖపట్నం జూ కు తరలించారు. అరుదైన తెల్ల పులి ఎందరో పర్యాటకులను ఆకర్షించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న ఏకైక తెల్ల పులి కుమారి కావడం విశేషం.
Advertisement
తాజా వార్తలు
Advertisement